Telusa Telusa by Anudeep Dev lyrics cover
LYRICSSONG LYRICS

Telusa Telusa

by Anudeep Dev, Lipsika

Released Oct 15, 2026 · 2026

Album Thellakaagitham

Play Now
0.0 (0 votes)

About this song

Telusa Telusa Lyrics. The song is sung by Anudeep Dev, music by Vijai Bulganin, lyrics by Suresh Banisetti. Starring Harsh Roshan, Nakshatra, Deepak, Ajay. Language: Telugu. From Movie Thellakaagitham (2026).

Telusa Telusa Lyrics

Lyrics PDF

ప్రేమనే ఒక లోకం వుందిలే మనకోసం
అందులో కలకాలం జంటగా కలిసుందాం
చూపులే కలిపేద్దాం మాటలే నిలిపేద్దాం
మాయలో మునకేద్దాం హాయిలో పడిలేద్దాం

ప్రేమజాతలో సాగే పయనం
దూరమవదే ఏ దూరం
ప్రేమకథలో రోజు మధురం
నేరమవదే ఏ నేరం

తెలుసా తెలుసా చిలిపి మనసా
నువ్వు నా ఎదలో రూపం
తెలుసా తెలుసా చిలిపి మనసా
నువ్వు నా జతలో దీపం

నువ్వే నా మనసున దేవత గుడివే
నువ్వే నా బతుకునీ మార్చిన బడివే
నువ్వే నా పెదవికి నవ్వుల సడివే
నువ్వే నా అడుగుకి పువ్వుల జడివే

తెల్లని తెల్లని కాగితమా
రంగుని నేనవనా
అల్లరి అల్లరి పావురమా
రెక్కని నేనవనా

అమరం అఖిలం ప్రేమా
మనదేలే అందమా

తెలుసా తెలుసా చిలిపి మనసా
నువ్వు నా ఎదలో రూపం
తెలుసా తెలుసా చిలిపి మనసా
నువ్వు నా జతలో దీపం

చూపులే చదివాను సైగలే చదివాను
అందుకే చెలి నేను నేనులా మారిలేను
గుండెనే తెరిచాను ప్రేమనే పరిచాను
నిన్నిలా పిలిచాను నీడలా నడిచాను

కోటి కలలే కన్నది నయనం
చేయి కలిపే నీకోసం
ఆదమరుపై చూసెను హృదయం
తోడు నిలిచే నీకోసం

కలిసే కలిసే కనులు కలిసే
కలలే మెరిసే ప్రేమా
మనసే మనసే ముడులు బిగిసే
విడని వరసే ప్రేమా

Premane oka lokam vundhile manakosam
Andhulo kalakaalam jantaga kalisundham
Choopule kalipedham maatale nilipedham
Mayalo munakedham hayilo padiledham

Premajathalo saage payanam
Dooramavadhe ye dooram
Premakadhalo roju madhuram
Neramavadhe ye neram

Telusa telusa chilipi manasa
Nuvu naa yedhalo roopam
Telusa telusa chilipi manasa
Nuvu naa jathalo deepam

Nuvve naa manasuna devatha gudive
Nuvve naa bathukuni maarchina badive
Nuvve naa pedhaviki navvula sadive
Nuvve naa aduguki puvvula jadive

Thellani thellani kaagithama
Ranguni nenavana
Allari allari paavurama
Rekkani nenavana

Amaram akhilam premaa
Manadhele andhamaa

Telusa telusa chilipi manasa
Nuvu naa yedhalo roopam
Telusa telusa chilipi manasa
Nuvu naa jathalo deepam

Choopule chadhivaanu saigale chadhivaanu
Andhuke cheli nenu nenulaa marilenu
Gundene therichaanu premane parichaanu
Ninnila pilichaanu needala nadichaanu

Koti kalale kannadhi nayanam
Cheyi kalipe neekosam
Aadhamarupai choosenu hrudhayam
Thodu niliche neekosam

Kalise kalise kanulu kalise
Kalale merise premaa
Manase manase mudulu bigise
Vidani varase premaa

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!